సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై అధిష్టానం చర్యలు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఎన్నారై కాకర్ల సురేష్ లపై టిడిపి అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. ఇరువురి పేర్లతో ఐవీఆర్ సర్వేలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించి ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయాలు స్వీకరించినట్టు విశ్వసనీయ సమాచారం.. కాకర్ల సురేష్ గత కొద్దిరోజులుగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వినూత్నమైన సేవ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట్రామారావుకు ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలను తన వైపుకు తిప్పుకోవడంలో కాకర్ల సఫలీకృతమయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా కాకర్ల సురేష్ పేరు ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం.. కానీ కేంద్ర బీజేపీ పెద్దలతో బలమైన సత్సంబంధాలు ఉన్న బొల్లినేని వెంకట రామారావు ఉదయగిరి సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేరు. టిడిపి అధినేత చంద్రబాబుపై తన వంతు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. బొల్లినేని వర్గం టిడిపి టికెట్ మాదే నాన్న ధీమాలో ఉంది. ఉదయగిరి నియోజకవర్గ టిడిపి పై స్పష్టత రావాలంటే మరి ఒక రెండు రోజులు ఆగాల్సిందే.