సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ అకృత్యాలు వెలుగు చూశాయి. వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి తనను ప్రేమించాలని గ్రామానికి చెందిన ఇద్దరు (అక్క చెల్లెలు)లకు కొన్ని నెలలుగా నరకం చూపించాడు. వేధింపులకి భయపడి పెద్ద కూతురుకి ఐఐఐటి సీటు వచ్చినా తల్లిదండ్రులు కాలేజీకి పంపలేదు. అక్క అందుబాటులో లేకపోవడంతో చెల్లిని పిట్టు శ్రీకాంత్ రెడ్డి టార్గెట్ చేసాడు. దాంతో చెల్లెలు అతడి వేధింపులు భరించలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. బాలిక పరిస్థితి విషమంగా వుండడంతో , నరసరావుపేటలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.