సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో వీరమ్మ తల్లి ఊరేగింపు మహోత్సవం రెండో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో భాగంగా నిన్న రాత్రి నుంచి పురవీధుల్లో భక్తుల సమక్షంలో ఊరేగింపు ఆలయ కమిటీ ద్వారా నిర్వహించారు. భక్తులు అందరూ ఉయ్యాల ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారు ఆలయ ప్రవేశం చేశారు .భక్తులందరూ తమ కోర్కెలు తీర్చుకుంటూ ఎదురు దీపాలతో అమ్మవారికి నైవేద్యం పెడుతూ మొక్కులను తీర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వీరమ్మ తల్లి ని దర్శించినందుకు పోటెత్తారు