భర్త ప్రమాద భీమా కొరకు యువతి నిరసన దీక్ష

 సిరా న్యూస్,వినుకొండ;

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్ లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద భర్త ప్రమాద భీమా కొరకు యువతి నిరసన దీక్ష చేపట్టడం పట్టణంలో చర్చకు దారితీసింది. ఈ ఘటనతో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భర్తను పోగొట్టుకున్న యువతిపై సంబందిత అధికారులు ఏ మాత్రం కనికరం చూపకుండా గత నాలుగు సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అందజేయు భర్త యాక్సిడెంట్ చంద్రన్న భీమా(వై.యస్.ఆర్ భీమా) డబ్బులు సగం తీసుకుని సగం ప్రభుత్వ ఉద్యోగియైన రాజశేఖర్ కు ఇవ్వాలని డి.ఆర్.డి.ఏ అధికారులు తేల్చి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో వినుకొండలోని డా బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహం ముందు బుధవారం నిరసనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు పరిశీలిస్తే వినుకొండ పట్టణానికి చెందిన శ్రీరామ్ శాంతి నిరుపేద కుటుంబానికి చెందిన యస్.సి సామాజిక వర్గానికి చెందిన యువతి, గత ఐదు సంవత్సరాల క్రితం ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన గరనేపూడి మహేష్ బాబుతో వివాహం జరిగింది. డి.ఆర్.డి.ఏ అధికారులు చంద్రన్న పెండ్లి కానుక డబ్బు శ్రీరామ్ శాంతి అకౌంట్ లో జమ చేశారు. వాస్తవానికి ఆడపిల్ల తల్లిదండ్రులకు ప్రభుత్వం చంద్రన్న కళ్యాణ కానుక అందజేస్తారు. రాజశేఖర్ డి.ఆర్.డి.ఏ లో పనిచేస్తుండటంతో అధికారులను మేనేజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. వివాహం జరిగిన సంవత్సరం తరువాత ఈపూరు మండలం కొత్త నెల్లూరు సమీపంలో శాంతి భర్త మహేష్ బాబు బైక్ యాక్సిడెంట్ లో బైక్ పై నుండీ పడి కుక్కలు కరవడం వల్ల మహేష్ బాబు మరణించాడు. ఈపూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మహేష్ బాబుకు చంద్రన్న భీమా అప్పటికే ఉన్నది. మహేష్ బాబు తండ్రి డి.ఆర్.డి.ఏ లో ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తాను మహేష్ బాబు చంద్రన్న భీమాకు నామినిగా ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన కుటుంబ యాజమాని మరణిస్తే అతనిపై ఆధారపడి ఉన్న వారు ఇబ్బందులు పడకుండా వారికి ఆర్థిక సహాయం అందజేయడానికి ఈ భీమాను అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. చంద్రన్న భీమాలో ప్రభుత్వ ఉద్యోగియైన తండ్రి నామినీ గా ఉన్నప్పటికి ప్రభుత్వం పేద బాధితుల కోసం కల్పించిన ఇన్సూరెన్స్ కాబట్టి మరణించిన వ్యక్తి భార్య బ్రతికి ఉన్నప్పుడు భార్యను ఇన్సూరెన్స్ పొందుటకు హక్కురాలిగా స్థానిక డి.ఆర్.డి.ఏ అధికారులు సిఫారసు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *