సిరా న్యూస్, ఆదిలాబాద్:
సోషల్ మీడియాలో రెడ్డిల పేరుతో అసత్య ప్రచారం
– ఖండించిన ఆదిలాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం
+ నిందితులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ కి వినతి
రెడ్డిల పేరిట సోషల్ మీడియాలో కొంతమంది చేపడుతున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని ఆదిలాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. బుధవారం ఈ మేరకు సంఘం సభ్యులు ఆదిలాబాద్ డిఎస్పి సంజీవరెడ్డిని కలిశారు. రెడ్డిల పేరిట సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవలే డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్పీని కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షలు నల్ల నారాయన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి రెడ్డి, ఐక్య వేదిక యూత్ ప్రధాన కార్యదర్శి క్యాతం శివప్రసాద్ రెడ్డి రెడ్డి, యూత్ కో కన్వీనర్ కాటిపెల్లి స్వప్నిల్ రెడ్డి, యువజన విభాగం నాయకులు బోండ్ల సాయి కిరణ్ రెడ్డి, నాయకులు కృష్ణరెడ్డి, గోక శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.