దేవనకొండ,(సిరా న్యూస్);
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ లో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. యాత్రలో లో భాగంగా డాక్టర్ వైయస్సార్ స్ఫూర్తి వనం లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రులు అంజద్ భాష, ఆదిములపు సురేష్, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు మేయర్ రామయ్య, శిల్ప చక్రపాణి రెడ్డి, హాఫిజ్ ఖాన్, శ్రీశైలం అసెంబ్లీ అబ్జర్వర్, కర్నూలు జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక నివాళులరపించారు. అనంతరం సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎంపీపీ లు, జెడ్పీటీసీ లు, వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తిరుమలేశ్వర్ రెడ్డి, నన్నూర్ బేగ్,నాని, సతీష్, రాజు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.