(సిరా న్యూస్);
ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్చేశారు .వీరికి శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు స్వాగతం పలికారు . అనంతరం కోదండరామిరెడ్డి రాహుకాల సమయం లో సహస్ర లింగం వద్ద ప్రత్యేక రాహు కేతు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయిలిగేశ్వర స్వామి వారి దర్శించుకుని శ్రీ గురుదక్షిణ మూర్తి సన్నిధి వద్ద ఆలయ అదికారులు శేషవస్త్రంతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని,తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్,మరియు వేద పండితులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు