సిరా న్యూస్,అమరావతి;
కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాలు గురువారం తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ ముట్టడికి ఎటువంటి అనుమతులు లేవని జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్పష్టం చేశారు. ఆయా సంఘాల నాయకులెవరూ అనుమతి కొసం దరఖాస్తు చేయలేదని చెప్పారు. 30 పోలీసు చట్టం, సెక్షన్ 144 అమలులో ఉన్నందున ఎటువంటి ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. నిబంధనలు అతిక్రమించి ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.ఈ నేపథ్యంలో మందడం మల్కాపురం జంక్షన్ వద్ద సెక్రటేరియట్ కి వెళ్లే మార్గాలలో పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు.