Brahmotsavam invitation card : గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

సిరా న్యూస్,మంగళగిరి;
శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇన్చార్జి గంజి చిరంజీవి తదితరులు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ రెండు ప్రధాన వైష్ణవాలయాల మధ్య ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల 29 నుండి వచ్చే నెల 12వ తేదీ వరకు జరగనున్న ఆయన తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, మరి ముఖ్యంగా మార్చి 8వ తేదీ స్వామివారి కళ్యాణం మరియు 10వ తేదీ దివ్య రథోత్సవ కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నేరెళ్ల లక్ష్మీ రాధిక, పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *