Somashila reservoir : మాఫియా వలలో సోమశిల జలాశయం

బ్యాక్ వాటర్ లో అక్రమార్కుల దందా

నిషేధిత కాలంలోనూ ఆగని చేపల వేట

నిబంధనలు తుంగలో తొక్కుతున్న వైనం

సిరా న్యూస్,బద్వేలు;
సోమేశుల జలాశయం వెనుక జలాల్లో అక్రమార్కుల కాసుల వేట యదేచ్చగా సాగుతుంది. అడ్డగోలుగా అరుదైన మత్స్య సంపదను దర్జాగా దండుకుంటున్నారు. చేపల సంతతిని బరితెగించి మింగేస్తున్నారు. నిషేధిత కాలంలోనూ మాఫియా వల విసిరి దోచేస్తున్నారు. జల చేరాల మేత యదేచ్చగా సాగుతున్న పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఆ కొందరి కాసుల కక్కుర్తికి అరుదైన జాతులు అంతరించి పోతున్నాయి. క్షేత్ర స్థాయిలో నిఘ లేకుండా పోయింది. కంటి ముందే అలివి గాని దోపిడి జరుగుతున్న అధికార యంత్రాంగం కట్టడి చేయడం లేదు. చేపల వేటపై ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. ప్రతిరోజు టన్నులకొద్ది చేపలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న పట్టుచున్నవారు లేకుండా పోయారు. అక్రమ చేపల వేటకు అడ్డుకట్ట పడడం లేదు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా పిల్ల చేపలకు ప్రాణ సంఘటనగా మారింది. నెల్లూరు జిల్లాలో నిర్మించిన సోమశిల జలాశయం సామర్థ్యం 77.988 టీఎంసీలు ప్రస్తుతం 39.348 శతకోటి ఘనపు అడుగుల నీరు ఉంది. వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట అట్లూరు గోపవరం
సిద్ధవటం అన్నమయ్య జిల్లా నందలూరు పెనగలూరు చిట్వేలి మండలాల సరిహద్దులో వెనుక జలాలు నిలువ ఉన్నాయి. వెనుక జలాల్లో గత కొన్ని సంవత్సరాలుగా జూలై ఆగస్టు మాసాల్లో ప్రభుత్వం చేపల వేట నిషేధించింది. చేపలు గుడ్లు పెట్టే సమయం ఇది. వల విసిరితే అరుదైన జాతుల సంతాన ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం నిషేధం విధించింది క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లేకుండా పోయింది. మాటేసిన మాఫియా మృత్యు వల విసురుతున్నడంతో సహజ సంపద హరించుకుపోతుం.ది అక్రమ వ్యాపారాన్ని నమ్ముకున్న కొంతమంది వ్యాపారులు మరికొందరు షావుకారులు కొంతమంది అధికారులను మచ్చిక చేసుకున్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి అధికారులు ఇటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. ఒంటిమిట్ట మండలంలో సోమేశుల ముంపు గ్రామాలైన 10 గ్రామాల్లో అక్రమ చేపల వేట చాలా కాలంగా జరుగుతుంది. అలాగే బద్వేల్ నియోజకవర్గం గోపవరం అట్లూరు మండలాల పలు గ్రామాల బ్యాక్ వాటర్ లో అక్రమ చేపల వేట సాగుతుంది. తూర్పుగోదావరి విశాఖపట్నం విజయనగరం నెల్లూరు ప్రకాశం జిల్లాలతోపాటు ఒడిస్సా రాష్ట్రం నుంచి చేపల వేటలో నైపుణ్యం ఉన్నవారిని ఇక్కడికి రప్పించారు. బ్యాక్ వాటర్ సమీపంలోనే గుడారాలు వేయించి అక్కడే వారిని ఉంచారు. ఒక్కొక్కరికి నెలకు 8000 రూపాయల నుంచి 12 వేల రూపాయలు మాఫియా ఇస్తుంది. మరికొందరికి చేపల రకాన్ని బట్టి కేజీకి 25 రూపాయల నుంచి 80 రూపాయల వరకు కమిషన్ ఇస్తున్నారు. గోపవరం మండలంలో అక్రమ చేపల వేట ఎంతో దర్జాగా సాగుతుంది. సోమశిల జలాశయం ఉన్న బ్యాక్ వాటర్ వస్తున్న ప్రతి గ్రామంలోనూ అక్రమ చేపల వేట సాగుతుంది. సోమేశిల జలాశయం వెనుక జలాలు నిల్వ ఉన్న ప్రాంతంలో నోరు ఊరించే చేపలు ఉత్పత్తి అవుతున్నాయి వీటికి భలే గిరాకీ ఉంటుంది. ఇక్కడ పట్టిన చేపలు హైదరాబాద్ విజయవాడ బెంగళూరు మద్రాసు మార్కెట్లకు తరలిస్తున్నారు. నాణ్యత
పరిణామం తాజాగా ఉన్న చేపలను గ్రేడింగ్ చేసి శీతల పెట్టేల్లో నింపి రవాణా చేస్తున్నారు సన్న రకాలను ఎండబెట్టి ఎండుతున్న చేపలను మార్కెట్కు తరలించి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. సోమేశిల బ్యాక్ వాటర్ నిల్వ ఉన్న ప్రాంతాన్ని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి అభయార్యంగా చేస్తూ 1997 సెప్టెంబర్ 15వ తేదీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అడవిలోకి అనుమతులు లేకుండా వెళ్ళకూడదు. ఎటువంటి వాహనాలు వెళ్లకూడదని అటవీశాఖ చట్టాలు చెబుతున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేయకుండా అటవీశాఖ అధికారులు ఎప్పుడో గాలికి వదిలేశారు. రాజకీయ అండతో మాఫియా చెలరేగి పోతుంది.
నిఘ వ్యవస్థ ఇప్పటికీ కునికి పాట్లు పడుతూనే ఉంది పెన్నా నదికి దగ్గర్లో స్థావరాలు ఉంటే ఇట్లే తెలుసుకోవచ్చు పినాకిని అవతల గుడారాలు తాత్కాలిక నివాస స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడికి అధికారులు వెళ్లడం చాలా కష్టం నాటు పడవలో చేరుకోవాలి. అంత సాహసం చేసే వారు లేరని చెప్పాలి. అభయారణ్యంలో నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా నివాసం ఉంటున్న అడ్డుకునే వారు లేరు. అటవీ చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ ప్రయోజనం మాత్రం లేకుండా పోయింది ఇదే అక్రమార్కులకు వరంగా మారింది
బ్యాక్ వాటర్ లో చేపల సంతాన ఉత్పత్తి జరుగుతుంది గుడ్లు పెట్టే సమయం ఇది సోమేశిల బ్యాక్ వాటర్ లో అక్రమ చేపల వేటను అడ్డుకోవడానికి టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ అటవీ రెవెన్యూ పోలీస్ విభాగాలతో అధికారులు సమన్వయంతో దాడులు చేసి నిషేధిత సమయంలో చేపల వేట జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కార్య దళం ఏమైందో జిల్లా అధికారులకే తెలియాలి. ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది స్థానిక రాజకీయ నాయకుల అండతో ప్రతిరోజు టన్నుల కొద్ది చేపలు తరలిపోతూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *