MLA Payal Shankar: దేశ రక్షణ నరేంద్ర మోడీ తోనే సాధ్యం…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

దేశ రక్షణ నరేంద్ర మోడీ తోనే సాధ్యం…

– ఎమ్మెల్యే పాయల్ శంకర్

దేశం బయట, దేశం లోపల ఉన్న శత్రువుల నుండి దేశాన్ని కాపాడటం భారత ప్రధాని నరేంద్ర మోడీ తోనే సాధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి లో నిర్వహించిన విజయ్ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశం అభివృద్ధి చెందాలన్నా, రామరాజ్యం రావాలన్న నరేంద్రమోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాల్సిందేనని అన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. గ్యారెంటీ ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. గడిచిన ఐదేళ్లలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిజెపితోనే సాధ్యమైందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని కోరారు. మూడోసారి కూడా కేంద్రంలో బిజెపి అధికారం కట్టబెట్టాలని, మళ్లీ నరేంద్ర మోడీ ని ప్రధానిని చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *