సిరా న్యూస్,హైదరాబాద్;
పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ ప్రశ్నించారు. పాతబస్తీలో ని ఎంఐఎం ప్రజాప్రతినిధులు రాష్ట్ర .గ్రేటర్ బడ్జెట్ కేటాయింపులలో తీవ్ర అన్యాయం జరిగినా నిలదీయక పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ పథకాలన్నీపాతబస్తీకి ఎందుకు చేరడం లేదని నిలదీశారు.
ప్రభుత్వం చొరవ తీసుకొని పాతబస్తిని అభివృద్ధి చేస్తే ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని తెలుస్తుంది. పాత నగరం రోడ్లు, డ్రైనేజీ పరిసరాల అభివృద్ధి మూసి శుభ్రపరచడం, మురికివాడల ప్రజలకు ఆర్థికంగా అభివృద్ధి పడేలా తోడ్పాటు కల్పించేలా కృషి చేయాలన్నారు. పాతబస్తీ అభివృద్ధితో పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు గైడ్స్, హోటల్స్, రవాణా, వివిధ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ఎంతో మంది యువకులకు, ఉపాధి కలుగుతుందని వివరించారు. పాతబస్తీ అభివృద్ధిని మెరుగుపరిచి పాతబస్తీ చారిత్రకతను చాటి చెప్పాలన్నారు.పాత బస్తీ అభివృద్ధిలో నిర్లక్ష్యం తగదని పాతబస్తీలో ఉన్నటువంటి అపోహలు, అపార్థాలు తొలగించి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు.