సిరా న్యూస్,జగ్గయ్యపేట;
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి కన్నుల పండుగగా సాగింది. అమ్మవారి ఆలయం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై తిరుపతమ్మ, గోపయ్య స్వాముల ఉత్సవ విగ్రహాలను ఉంచి వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నందిగామ ఎసిపి రవికిరణ్ దంపతులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఉదయభాను దంపతులు, ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు, ఈవో రమేష్ నాయుడు, అమ్మవారి వంశీయులైన కొల్ల రగు రామయ్య, దంపతులు పట్టువస్తాలు సమర్పించి పీటలపై కూర్చున్నారు. కళ్యాణం వీక్షించేందుకు వేలాదిమంది తరలివచ్చారు. నందిగామ ఎసిపి రవికిరణ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.