సిరాన్యూస్, కరీంనగర్
రహదారిపై గుంతలను పూడ్చిన పోలీసులు
అడుగడుగున ప్రమాదకరంగా ఉన్న చిగురుమామిడి మండలంలో కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్లే రహదారిపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో శనివారం గుంతలను పూడ్చారు.ఆర్ అండ్ బీ, ధరణి కన్స్ట్రక్షన్ వారి సహకారంతో స్థానిక చిగురుమామిడి పోలీస్ శాఖ వారు ఈ పనులను చేపట్టారు. గుంతలను పూడ్చడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుందని వాహనదారులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారిని పలువురు అభినందించారు.