AISF MOHAMMED: చదువుల పేరుతో వ్యాపారం చేస్తున్నవిద్యాసంస్థలను సీజ్ చేయాలి

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
చదువుల పేరుతో వ్యాపారం చేస్తున్నవిద్యాసంస్థలను సీజ్ చేయాలి
* ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు మహమ్మద్
* శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎదుట ధ‌ర్నా
చదువుల పేరుతో వ్యాపారం చేస్తున్నవిద్యాసంస్థలను త‌క్ష‌ణ‌మే సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు మహమ్మద్ అన్నారు. బుధ‌వారం కళ్యాణదుర్గం పట్టణంలోని న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ముందర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు మహమ్మద్, ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడారు. 2024 -2025 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందునే విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులకు మాయమాటలు చెప్పి టెక్నో ఈ టెక్నో ఐకాన్ వంటి కోర్సుల పేర్లు చెప్పి అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తానని చెప్తూ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇప్పటినుంటే విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ చేస్తూ తరగతులను నిర్వ‌హిస్తున్నార‌న్నారు.ఇప్పటికే శ్రీ చైతన్య విద్యాసంస్థలో చదివే విద్యార్థులు ఫీజులు వేధింపులు భరించలేక అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్, కళాశాలలో ఎటువంటి మౌలిక వసతులు లేకున్నా, ఒకచోట అనుమతి తీసుకుని ఇంకొక చోట కళాశాల , స్కూల్ నిర్వహిస్తున్నార‌ని ఆరోపించారు. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాలు బలికొంటున్న శ్రీ చైతన్య టెక్నో విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రాణాలకు గురవుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ఫుడ్ కమిషన్ కూడా శ్రీ చైతన్య టెక్నో విద్యాసంస్థల్లో ఎటువంటి ఫుడ్ పెడుతున్నారో పరిశీలించాల‌ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని గుర్తింపు లేని శ్రీ చైతన్య టెక్నో విద్యాసంస్థలను సీజ్ చేయాల‌న్నారు. అక్రమ అడ్మిషన్ చేస్తూ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య టెక్నో విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శివమూర్తి హర్షవర్ధన్, పట్టణ సహాయ కార్యదర్శి అజయ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పవన్, జయంత్, బాలు, అనిల్ చిదానంద, సిద్దు, సింహాద్రి, అరుణ్, మంజు, అభి తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *