సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా కొనిజర్ల సర్పంచ్ సూరంపల్లి రామారావు పై కత్తులతో దాడి అర్ధరాత్రి జరిగిన సంఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.దాడిలో గాయపడ్డ సర్పంచును ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.
నిందితులు ముగ్గురు వ్యక్తులు కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేశారని భావిస్తున్నారు. గ్రామానికి చెందిన సవ్వల్లా కృష్ణ అతని ఇద్దరు కుమారులు కలిసి కత్తులతో పాల్పడ్డారనీ చెబుతున్నారు.
అన్నదమ్ముల ఆస్తి వాటాల పంపకంలో తమకు న్యాయం చేయలేదని కక్షతో దాడికి పాల్పడ్డారనీ తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సూరంపల్లి రామారావును ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ లో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా 144 సెక్షన్ అమలుకు తీసుకు వచ్చారు.