సిరా న్యూస్, గుడిహత్నూర్
ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి
* రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలము లోని మన్నూర్ గ్రామానికి చెందిన కదం నారాయణ అనేరైతు గత వారం రోజుల క్రితం ఇంట్లోనే పురుగుల పురుగుల మందు తాగి చనిపోయాడు. ఈవిషయం తెలుసుకున్న రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ , రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్నతో పాటు బలిరామ్ తో కలిసి రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని కలిశారు. రైతు సాగుచేస్తున్న వ్యవసాయ భూమి 13 ఎకరాలను కౌలుకి తీసుకొని సాగుచేస్తున్నసందర్బంలో వ్యవసాయానికి చేసిన అప్పులు , పంట పెట్టుబడులు , దిగుబడలకి గల కారణాలను అడిగి వాటి వివరాలను నమోదు చేసుకోవడం జరిగింది. వాస్తవంగా గత రెండు మూడు సంవత్సరాల నుండి అతివృష్టి, అనావృష్టి ఉండడంతో ఆశినంత పంట దిగుబడి రాక పోవడముతో మానసికంగా కృంగిపోయి పంటకు పెట్టిన పెట్టుబడులు రాలేవని,తీసుకొచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని వారు తెలిపారు. ఈ కుటుంబానికి రైతుభీమా తో పాటు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 194 జీఓ ప్రకారంగా ఆరు లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కుటుంబ యజమానురాలికి నెలకు 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వీరి పిల్లలకు ఉన్నతమైన విద్య, వైద్య ఉపాధి అవకాశ సదుపాయాలు ఇతర అవకాశాలు అందించాలని, వ్యవసాయ రంగంలో అతి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఇచ్చే విదంగా చిరు దాన్యలను పండించే విదంగా కృషి చేయాలనీ , నెలసరి ఆదాయం 15000 రూపాయలు ఆదాయం వచ్చే విదంగాఆకు కూరగాయల ఇతర పంటల సాగును ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. ఇందులో రైతులు బలిరామ్, గోవింద్, బాలాజీ తదితరులున్నారు.