సిరా న్యూస్,ములుగు;
గురువారం నాడు మేడారం హుండీల లెక్కింపు ప్రారంభమయింది. లెక్కింపు కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. హనుమకొండ లోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కింపు జరుగుతోంది. పదిరోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది. పటిష్టమైన భద్రత మధ్య లెక్కింపు ప్రక్రియ కొనసాగునుంది. లెక్కింపు కేంద్రం లోపల-బయట సీసీ కెమెరాలు,భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ వుంటుంది. మొత్తం 512 హుండీలను లెక్కించనున్నారు. లెక్కించిన నగదును బ్యాంకులో ఏ రోజుకారోజు జమ చేస్తారు. ఈసారి మేడారం జాతర ఆదాయం పెరుగుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు