Kanaka Tulsiram: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి

సిరా న్యూస్, ఇంద్రవెల్లి
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి
• వడగావ్ మాజీ సర్పంచ్ కనక తులసిరాం
• సీసీ రోడ్ ప‌నులకు భూమి పూజ‌
గ్రామాల అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వడగావ్ మాజీ సర్పంచ్ తులసిరాం అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వడగావ్ గ్రామంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు సిసి రోడ్ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పేదల సంక్షేమానికి కృషి చేసె ఏకైక ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. గ్రామాలలో అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముఖాడే ఉత్తం, పట్టణ అధ్యక్షుడు ఎండీ జహిర్, ఎంపీటీసీ మధుకర్, నాయకులు కొడప ఆచపత్ రావ్, పెందూర్ ఆనందరావ్, మెస్రం సీతారాం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *