అమలాపురం,(సిరా న్యూస్);
కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో కోనసీమలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటికీటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి గోదావరి నది పాయలు లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రసిద్ధ మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయంలో, పలివెల ఉమా కొప్పేశ్వర స్వామి ,ముక్తేశ్వరం క్షణముక్తేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఏకాదశరుద్రులు, పంచ సోమేశ్వర ఆలయాలు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు.