జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్
సిరా న్యూస్,విజయనగరం;
సీనియర్ అసిస్టెంట్‌గా ఇ.సూర్యారావు అందించిన సేవలు మరువలేనివని డిఐపిఆర్ఓ డి.రమేష్ అభినందించారు. ఆయన సుమారు 44 ఏళ్లపాటు సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘంగా సేవలందించారని చెప్పారు. విధినిర్వహణ పట్ల సూర్యారావు చూపించిన అంకితభావం ఇతరులకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పౌర సంబంధాల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా సేవలందించి, ఫిబ్రవరి నెలాఖరున ఉద్యోగ విరమణ చేసిన సూర్యారావును శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎడి రమేష్ మాట్లాడుతూ, సూర్యారావు చేసిన సేవలను కొనియాడారు.
సన్మాన గ్రహీత సూర్యారావు మాట్లాడుతూ శాఖలో తన ఉద్యోగ జీవిత అనుభవాలను వివరించారు. తాను 44 ఏళ్లపాటు పార్ట్‌టైమ్, కంటింజెంటు, అటెండరు, టైపిస్టు, సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేశానని, తనకు విధి నిర్వహణలో సహకరించిన అధికారులకు, సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. డిఇఇ ఎస్వి రమణ, ఏఇ శ్రీలక్ష్మి, పిఆర్ఓ మజ్జి వాసుదేవరావు, ఎవిఎస్ సత్యనారాయణ, రికార్డు అసిస్టెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ, సూర్యారావు అందించిన సేవలను కొనియాడారు. అతనితో తమకున్న అనుబంధాన్ని వివరించారు. కార్యక్రమంలో శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
==================