బెంగళూరు, (సిరా న్యూస్);
చంద్రయాన్ – 3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో మిషన్ ఆదిత్య. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య మిషన్‌ను ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్-1 ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్‌కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్‌ను చేరుకునే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఎల్-1 పాయింట్ నుంచి సూర్యుడి చిత్రాలను తీసి భూమికి పంపించనుంది. సూర్యుడిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇవి ఇస్రోకు ఉపయోగపడనున్నాయి.ఇలాంటి కరెక్షన్‌ను ఇస్రో చేపట్టడం ఇదే తొలిసారి సెప్టెంబర్ 19న చివరిసారిగా ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ మాన్యువర్‌ను పూర్తి చేసిన తర్వాత దాని ట్రాక్‌ను సరిచేయడానికి ఇది అవసరమని ఇస్రో పేర్కొంది. ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ హాలో ఆర్బిట్ చొప్పించాల్సి వచ్చినట్లు ఇస్రో చెప్పింది. ట్రాజెక్టరీ కరెక్షన్ చేయడంతో ఆదిత్య-ఎల్1 అంతరిక్ష వాహక నౌక.. ఉద్దేశించిన మార్గంలో సాగుతోందనే విషయం నిర్ధారణకు వస్తుందని పేర్కొన్నారు