సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు రాంజీ నగర్ లోని తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నేత, జిల్లా మాజీ మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ జెడ్పిటిసి ముప్పాళ్ల విజేతా రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయం తెలుసుకుని విజేత రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో ఏమిలేక పోవడంతో పోలీసులు వెనుదిరిగారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ కు సన్నిహితులు, తెదేపా ముఖ్య అనుచరులు సానుభూతి పరుల నివాసాలపై పోలీసుల నిఘా వుంచినట్లు సమాచారం.