హైబీపీ ఉన్న వాళ్లు మాత్రం నిద్రలో ఎదురయ్యే సమస్యలపై దృష్టి పెట్టాలి

సిరా న్యూస్;

అలసిపోయిన మనసు, శరీరానికి నిద్ర ఓ దివ్యౌషధం. అయితే, హైబీపీ ఉన్న వాళ్లు మాత్రం నిద్రలో ఎదురయ్యే సమస్యలపై దృష్టి పెట్టాలీ. బీపీకి సైలెంట్ కిల్లర్ అని పేరు. చాలా మందికి తమకు బీపీ (High BP) ఉన్న విషయమే తెలీదు. అయితే, రక్తపోటు ఉన్న వారికి నిద్రలో కొన్ని సమస్యలు ఎదురవుతాయని, ఇవి ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిళ్లు రక్తపోటు పెరగడానికి కారణం ఇదే
సాధారణంగా శరీరంలో అధికంగా ఉన్న సోడియం వదిలించుకునే క్రమంలో బీపీ పెరుగుతుంది. సాల్ట్ సెన్సిటివీ ఉన్న వాళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందట. కాబట్టి, బీపీ ఉన్న వాళ్లు ఉప్పు వినియోగం కాస్త తగ్గించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలు నియంత్రణలో లేకపోతే కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.
తలనొప్పి
రాత్రుళ్లు తరచూ తలనొప్పి వేధిస్తుంటే కూడా డాక్టర్లను సంప్రదించాలి. సాధారణంగా బీపీ ఉన్న వాళ్లల్లో రాత్రుళ్లు తలనొప్పి మొదలై తెల్లవారుజామున గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందట.
గురక
నిద్రలో అతిగా గురక (Snoring) పెట్టడం హైబీపీకి ఓ సంకేతం. ముఖ్యంగా మధ్యవయసుకు చేరుకున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొందరికి పగటి పూట బీపీ లేకపోయినా రాత్రిళ్లు రక్తపోటు పెరుగుతుందని కూడా వైద్యులు చెబుతున్నారు. అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని అంటున్నారు.
నిద్రలేమి
బీపీ ఉన్న వాళ్లు సరిగా నిద్రపట్టక కూడా బాధపడతారు. అధిక రక్తపోటు కారణంగా తలనొప్పి, ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి తలెత్తి రాత్రుళ్లు నిద్రపట్టదు. కాబట్టి, ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి. రాత్రిళ్లు పలుమార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడమూ అధికరక్తపోటుకు ఓ సంకేతమని నిపుణులు చెబుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *