సిరా న్యూస్,కళ్యాణదుర్గం
జీవాల సంరక్షణఫై ప్రత్యేక శ్రద్ధ
* ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు పంపిణీ
* అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య
రాష్ట్రంలో రైతు లు వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమపై అధికంగా ఆధారపడుతున్నారని, ప్రభుత్వం జీవాల పెంపునకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్యఅన్నారు. సోమవారం కుందుర్పి మండలం, నిజవల్లి గ్రామంలో పాడి రైతులకు, కృత్రిమ గర్భధారణ పశువులకు మేలు జాతి పెయ్యా దూడలు గురించి పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య హాజరయ్యారు. ఈసందర్భంగా పాడి రైతులకు సలహాలు సూచనలు తెలియజేశారు.పాడి పశువులకు సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేసినట్లైతే మేలు జాతి దూడలు జన్మించి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుందని జిల్లా పశు వైద్యపశు సంవర్ధక అధికారి డా, సుధాకర్ పేర్కొన్నారు.కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో పశు వైద్య శిబిరం ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.జిల్లాలో 100 పశువైద్య కేంద్రంలు,61గోపాల మిత్ర కేంద్రాలలో ఘనీ కృత వీర్యం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.రైతులు పశువుల ఎద లక్షణాలు గమనించి,పశువు ఎదకు వచ్చిన 12నుండి 24గంటల మధ్యలో కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్ చేసినట్లైతే పశువులు చూడి కడతాయి అన్నారు.ముఖ్యంగా బర్రెలలో మూగ ఎద ఎక్కువగా ఉంటుంది కాబట్టి బర్రెలను ఉదయం, సాయింత్రం గమనించాలి.ఎద ఇంజెక్షన్ చేసిన పశువులకు 2 నెలల తరువాత చూడి నిర్ధారణ పరీక్ష చేయించాలన్నారు.ఏదకు రాని పశువులు,గర్భ కోశ వ్యాధులు,ఇతర వ్యాధులు ఉన్న 95పశువులకు చికిత్సలు చేశారు.అదే విధంగా ప్రభుత్వం నుండి సంవత్సరానికి రెండుసార్లు గాలికుంటుటీకాలు,గొంతువాపు,జబ్బ వాపు టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కొంతమందిరైతులకు ఉచితంగా మందులు, బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌని ప్రభాకర్ , రిటైర్డ్ టీటీడీ ఈవో, ఓబిరెడ్డి జడ్పిటిసి రాధాస్వామి ఎంపీపీ కమలా నాగరాజు, వైయస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్ కే సుదర్శన్ రెడ్డి, వైఎస్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సత్యనారాయణ శాస్త్రి , కురువ సంఘం జిల్లా అధ్యక్షులు, దొనస్వామి, వాల్మీకి స్టేట్ డైరెక్టర్, కే పాలాక్షి , సింగల్ విండో అధ్యక్షులు , ఏఆర్ వన్నూరు రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, సచివాలయం కన్వీనర్ ఈ రాము , ఎంపీటీసీ నరసింహారెడ్డి, కోఆప్షన్ నెంబర్ ముజీవుల , వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, మాజీ ప్రతినిధులు, గ్రామ ప్రజలు, పశువైద్యఅధికారిడా. ప్రసాద్ ,వెటర్నరీ అసిస్టెంట్ ,గోపాల మిత్రులు,రైతులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు