కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో బీసి కులగణన చేర్చడం హర్షణీయం  కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీని కలిసి అభినందనలు తెలిపిన ఆళ్ల రామకృష్ణ

హైదరాబాద్ ,(సిరా న్యూస్)
కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హోటల్ తాజ్ కృష్ణలో 26 తొలగించబడిన సంఘాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మరియు అతని బృందం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసింది.. ఈ సందర్బంగా  26 తొలగించబడిన సంఘాల పోరాట కమిటీ అధ్యక్షుడు  ఆళ్ల రామకృష్ణ మరియు అతని బృందం ఎన్నికల ప్రచారం లో బాగంగా కాంగ్రెస్ పార్టీ అబ్యర్తుల గెలుపుకోసం చేస్తున్న ప్రచారం గురించి రాహుల్ గాంధీ కి వివరించారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అబ్యర్తుల గెలుపుకోసం ఆళ్ల రామకృష్ణ అతని బృందం చేస్తున్న కృషిని  రాహుల్ గాంధీ అభినందించారు వారికి  ధన్యవాదాలు తెలిపారు. ఈ సంగార్బంగా భారతదేశంలో కుల గణన కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మొదటి వ్యక్తిగా ఆళ్ల రామకృష్ణ తనను తాను పరిచయం చేసుకున్నారు.1414/2021 మరియు కుల గణన సమస్యపై ఇటీవలి పరిణామాలను రాహుల్ గాంధీ కి వివరించారు. అలాగే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కుల గణన అంశాన్ని చేర్చినందుకు రాహుల్‌జీని  అభినందించారు మరియు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 26 బీసీ తొలగించిన కులాలను తిరిగి చేర్చాలని అభ్యర్థించారు. AIOBCSA జాతీయ సలహాదారుగా  ఆళ్ల రామకృష్ణ మరియు జాతీయ అధ్యక్షుడు గౌడ కిరణ్ కుమార్ కూడా రాహుల్‌జీని కలుసుకున్నారు మరియు అఖిల భారత స్థాయిలో విద్యార్థుల సమస్యలపై వివరణాత్మక ప్రాతినిధ్యాన్ని సమర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *