మహేశ్వరం,(సిరా న్యూస్);
మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చనగారి లక్ష్మారెడ్డి సోమవారం శివగంగ ఆలయంలో పార్టీ గ్యారంటీ,మ్యానిఫాస్ట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహేశ్వరం శివాలయం లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, పార్టీ డిక్లరేషన్లు, మరియు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లను దెవుడి దగ్గర పెట్టడం జరిగింది. నియోజకవర్గ అభ్యర్ధి కేఎల్ఆర్ గారి తో పాటు నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అనుభంద విభాగాల నాయకులు, బూత్ కమిటీ సభ్యులు అందరు కలిసి దేవుడి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పిన హామీలన్ని నెరవేరుస్తామనే ప్రతిజ్ఞ చేశారు.