సిరా న్యూస్,సిరా న్యూస్;
ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా ” రికార్డ్ బ్రేక్” : దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు
పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి తెలియజేసిన విషయాలు
పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. రెండేళ్లపాటుగా నిర్మించడం అదేవిధంగా ఈ సినిమా పైన ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి?
గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాడు వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారు అనిపించింది. అందుకే ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించాం.
రికార్డ్ బ్రేక్ అనే టైటిల్ ఈ సినిమాకి జస్టిఫికేషన్ ఎలా అనుకున్నారు?
ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ అలాగే శనివారం మీడియా కు వేసిన షో లో వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఈ సినిమాకి ఇది కరెక్ట్ టైటిల్ అని చెప్పడంతో మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ సినిమాకి ఇదే యాప్ట్ టైటిల్ అని అందరూ అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు.
క్లైమాక్స్ గ్రాఫిక్స్ ఇవి ముందే అనుకున్నారా?
సినిమాకి అది అవసరం ముందే అనుకునే అంత ఖర్చు పెట్టి ఆ గ్రాఫిక్స్ ని చేయించాం.
ఈ సినిమాకి హీరోలు వీళ్లే అని ముందే అనుకున్నారా?
ప్రజెంట్ ఉన్న హీరోల్లో అంత బాడీ ఉన్నవాళ్లు వెయిట్ పుటప్ చేయగలిగిన వాళ్లు ఎవరూ లేరు. అప్పటి కాలానికి ఒక రామారావు గారు కృష్ణంరాజు గారు ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ గా సెట్ అయ్యారు.
కొత్త హీరోస్ పైన కొత్త వాళ్ళ పైన ఇంత బడ్జెట్ పెట్టడం అనేది కరెక్ట్ అనిపించిందా?
సినిమా రిలీజ్ అయ్యాక ప్రజలకు గుండెల్లో రికార్డ్ బ్రేక్ మంచి సినిమాగా నిలిచిపోవాలి. అందుకోసమే ఎక్కడ రాజీ పడకుండా తీసిన సినిమా ఇది.
ఈ సినిమాని ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి మీ పాషన్ ఏంటి?
ఎక్కడో తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసే వాడిని. సిని కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నాకు మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నేను వాళ్లకు సపోర్ట్ చేయడం ఇలా ఇండస్ట్రీలో ఎదిగి ఈ పొజిషన్ లో ఉన్నాను. నాకు నిద్రలో కూడా సినిమాలంటే ఇష్టం.
అప్పట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమా తీశారు ఇప్పుడు రికార్డ్ బ్రేక్? ప్రజెంట్ జనరేషన్ కి సినిమా ఎలా నచ్చుతుందనుకుంటున్నారు?
అప్పట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మంచి సినిమా విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతంలో చాలా బాగా ఆడింది. అప్పుడున్న కాంపిటీషన్ కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ ఖచ్చితంగా మంచి సినిమాగా నిలుస్తుంది.