సిరా న్యూస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
* నియోజకవర్గంలో ముక్కోనపు పోటీ..!
* ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖరారు
* ఇండియా కూటమి అభ్యర్థిపై సమాలోచనలు
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతుంది. టిడిపి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేయగా తాజాగా కాంగ్రెస్, సిపిఐ, సీపీఎం ఉమ్మడి అభ్యర్థిగా (ఇండియా కూటమి) ఎవరిని నిలపాలనే అంశం పై అనంతపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె. రామకృష్ణ, ఏఐసీసీ సభ్యులు రఘువీరారెడ్డి సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ రెండు పార్టీలు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు సమాచారం. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉండాలనేది నిర్ణయించినట్లు తెలుస్తోంది.కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యులు రఘువీరారెడ్డి, సీపీఐ రామకృష్ణ మధ్య ప్రాథమిక చర్చలు జరిగినట్టు తెలుస్తుందిఇదే జరిగితే నియోజకవర్గం లో ముక్కోనపు పోటీ ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.గతంలో కళ్యాణదుర్గం లో సిపిఐ ఎమ్మెల్యే గా బీటీ పకీరప్ప గెలుపొందిన విషయం తెలిదిందే.ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి గా సీపీఐ రామకృష్ణ ? లేదా రఘువీరారెడ్డి ? ఎవరు బరిలో ఉంటారోనని మిగిలిన పార్టీ అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు