సిరా న్యూస్, జైనథ్
పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు
* బీజేపీలో కక్ష సాధింపులు ఉండవు
* ఎంఎల్ ఏ పాయల్ శంకర్
* పెండల్‌లవాడ రోడ్డు ప్రారంభం
పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆదిలాబాద్ ఎంఎల్ ఏ పాయల్ శంకర్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండలవాడ గ్రామంలో 25 లక్షల వ్యయంతో నిర్మిచిన ఎన్ ఆర్‌జీఎస్ ఉపాధి హామీ పథకం క్రింద నిర్మించిన రోడ్డును ఎంఎల్ ఏ పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ పేదవాడు కూడా ఉపాధి లేక పస్తులుండకూడదు అన్న ఉదేశ్యంతో ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ పనులకు నిధులు కేటాయిస్తూ వారికీ అండగా నిలబడుతుంది కేంద్ర ప్రభుత్వమని అన్నారు. రాజకీయాలు వేరు ప్రజా పాలన ఇరు ఎన్నికలకు ముందువరకు నేను రాజకీయ నాయకుడిని ఎన్నికల్లో గెలిచినా తరువాత ప్రజా సేవకుడిని, ఫలానా గ్రామంలో నాకు ఓట్లు వేయలేదన్ననెపంతో వారిపై కక్షసాధింపు ఉండదన్నారు. గత పాలకులు కొందరు గ్రామస్థులు ఆయన వద్దకు వెళితే మీ ఒళ్లేనాకు ఓట్లు రాలే నేను మీ పని చెయ్య అని మొఖం మీదనే అన్న సందర్భాలు ఉన్నాయి అని అన్నారు. అటువంటి వారికి పుట్ట గతులు ఉండవన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు రాందాస్, అ శోక్ రెడ్డి, నరేష్, పి. అశోక్, ఉల్లాస్ రెడ్డి, పవన్, ప్రభాకర్ భూమన్న, ముకుంద్, కార్యకర్తలు పాల్గొన్నారు.