సిరా న్యూస్,ఆదిలాబాద్
మాలీల ఎస్టి హోదా అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి
* అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
త్వరలో జరగ నున్న పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మాలీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫూలే గెస్ట్ హౌస్ లో ఆయన మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ఆంధ్రాలో ఎస్టీలుగా ఉండి తెలంగాణలో బీసీలుగా ఉన్న మాలీ కులస్తులు ఎస్టి హోదా కల్పించాలని అనేక పోరాటాలు చేశారని, ఆ పోరాట ఫలితంగా అసెంబ్లీలో తీర్మానమై ఆమోదం కోసం కేంద్రానికి పంపడం జరిగిందని, ఆ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకే తమ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని సుకుమార్ పెట్కులే స్పష్టం చేశారు. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో చేర్చకపోతే అవసరమైతే పార్లమెంటు ఎన్నికల్ని బహిష్కరించి మాలీల ఐక్యత చాటి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని మాలికులస్తుల్ని కోరారు.