సిరా న్యూస్,ఓదెల
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించండి
* ఎంపీడీవో జి. తిరుపతి
* ఉపాధిహామీ పనుల పర్యవేక్షణ
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఎంపీడీవో జి. తిరుపతి అన్నారు. గురువారం ఓదెల మండల కేంద్రంలో డి 86 కెనాల్ వద్ద ఉపాధి హామీ పనులను ఎంపీడీవో, ఎంపీవోలు పర్యవేక్షించారు. కెనాల్ పక్కన ఉన్న ముళ్ళపదలు చెత్తాచెదారం ఉపాధి కూలీలతో తీసివేయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలోని ప్రతి గ్రామంలోని జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఓదెల మండల ఎంపీఓ. ఓదెల గ్రామ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి. ఫీల్డ్ అసిస్టెంట్ చెరుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.