ఆళ్లగడ్డ,(సిరా న్యూస్);
రాష్ట్రంలో రాజ్యాంగ విలువలను సైతం తుంగలో తొక్కి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించే ప్రజల గొంతుక నొక్కుతున్నదని ఆళ్లగడ్డ జనసేన పార్టి నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ ఉల్లంఘన ప్రధానంగా మన రాష్ట్రంలోనే జరుగుతున్నదని ఇతర రాష్ట్రాలు వేలెత్తి చూపిస్తున్నాయని విమర్శించారు. మత గ్రంథాలైన ఖురాన్ ,భగవద్గీత, బైబిల్ ను మనం ఎంత గౌరవిస్తామో అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా మనం గౌరవించడం జరుగుతుందని ఇరిగెల రాంపుల్లారెడ్డి నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ స్థానిక ఎమ్మెల్యే అధికారులను కూడా పార్టీ కార్యకర్తలుగా మార్చేసారని ఇరిగెల విమర్శించారు. నియోజకవర్గంలో నకిలీ మందులు ,ఎరువులు, మరోవైపు కేసి కెనాల్ తెలుగంగ ఆయకట్టు రైతులు నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. ఇదే పునరావృతమైతే రానున్న ఎన్నికలలో అధికార వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఇరి గెల రాంపుల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు ఇరిగెల నారాయణరెడ్డి జనసేన నాయకులు పెసర వాయి చాంద్ బాషా, రాం పుల్లయ్య పాల్గొన్నారు.