దేవనకొండ,(సిరా న్యూస్);
నిస్వార్థంగా తాను కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనాన్ని రైతులకు, బాధితులకు సహాయం రూపం లో ఇస్తున్న మంచి మానవాత వాది జనసేనా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని.. పవన్ రావాలి రాష్ట్రం లో ఆరాచక పాలన పోవాలని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ లోని దేవనకొండ మండల వీరమహిల అధ్యక్షురాలు బోయ సరోజ ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ శనివారం జనసేన పార్టీ నాయకురాలు సరోజ ఆధ్వర్యం లో తన సొంత ఖర్చులతో అనేకమంది మహిళ లతో శ్రీశైలం యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైల మల్లికార్జున, భ్రమరంబ దేవి లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన వీరమహిల నాయకురాలు సరోజ మాట్లాడుతూ పవన్ ముఖ్యమంత్రి కావడం తోనే రాష్ట్ర లో అవినీతి పాలన అంతమవుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసిన టీడీపీపార్టీ అధికారం లోకి వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీశైల మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు సరోజ తెలిపారు. ఈ యాత్ర కార్యక్రమం లో స్వాతి, రంగమ్మ, పింజరి దస్తిగిరమ్మ, అనేక మంది మహిళలు పాల్గొన్నారు.