డుంబ్రిగుడ,(సిరా న్యూస్);
మండలంలో పర్యటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో సోమవారం పర్యాటకులు పోటెత్తారు. అధిక సంఖ్యలో పర్యాటకులు తరలిరావడంతో చాపరాయి జలపాతం పర్యాటకులతో కిటకిటలాడింది. మైదాన ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వాహనాల్లో తరలి రావడంతో జలపాతంలో వాహనాల రద్దీ ఏర్పడింది. ఇక్కడికి సందర్శించిన పర్యాటకులు సరదాగా జలపాతంలో జారుకుంటూ స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. కుటుంబ సమేతంగా రోడ్డు కిరువైపులా వనభోజనాలు చేస్తూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. రోడ్డు కిరువైపులనున్న పూల తోటల్లో పర్యాటకులు ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు.