బద్వేలు,(సిరా న్యూస్)
బద్వేల్ లో విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సోమవారం సిపిఐ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కె.వి కృష్ణారెడ్డికి వినతి పత్రం సమర్పించారు పెరుగుతున్న విష జ్వరాలకు కారణం అవుతున్న దోమల నివారణకు స్వైర విహారం చేస్తున్న పందులు ఊరికి దూరంగా తరలించడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఐ బద్వేల్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి చంద్రమోహన్ రాజు మరియు పట్టణ కార్యదర్శి పెద్దుల్ల పల్లి బాలు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో 130 కోట్ల నిధులతో ఆర్భాటంగా కనీస ఆలోచన లేకుండా వేసిన సీసీ రోడ్ల వలన రోడ్లతోపాటు డ్రైనేజీ ఏర్పాటు చేయకపోవడంతో కొన్ని ప్రాంతాలు వర్షపు నీరు నిలువ చేరడంతో దోమలకు నిలయాలుగా మారి దుర్వాసన వెలువరిస్తూ సీజనల్ వ్యాధులకు మూలాలుగా మారుతున్నాయని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు వైద్య పరీక్షలు పేరుతో వేలాది రూపాయలు భారం పడుతున్నదని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలోని పేదల కాలనీలలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్, ఫాగింగ్ మరియు దోమల నివారణకు కావలసిన తక్షణ చర్యలను చేపట్టాలని వారు కోరారు. అలాగే పట్టణంలో కుక్కలు మరియు పందుల బెడద ఎక్కువైనదని ఇటీవల ఆంజనేయ నగర్ తో సహా అనేక ప్రాంతాలలో చిన్నపిల్లలు కుక్కల దాడికి గాయాలపాలై హాస్పిటల్లో చేరుతున్నారని తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలు మరియు పందులను ఊరికి దూరంగా తరలించి సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ, ఏఐటియుసి ప్రాంతీయ కార్యదర్శి పివి రమణ పట్టణ సహాయ కార్యదర్శి నరసింహ కార్యవర్గ సభ్యులు పెంచలయ్య నాగేష్ నాయకులు మునిరత్నం,రమణ తదితరులు పాల్గొన్నారు