శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా కార్తీక దీపోత్సవం

తిరుపతి,(సిరా న్యూస్);
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ దీపోత్సవం లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆలయం నుండి ప్రమిద దీపాలను తీసుకొని వచ్చారు. అర్చక స్వాములు ప్రమిద దీపాలను తిరు మాడ వీధులలో ఊరేగిస్తూ  గ్రామంలో గల ముఖ్యమైన కూడలిలలో దీపాలను ప్రతిష్టించారు. ఈ ఊరేగింపులో భాగంగా పద్మావతి అమ్మవారి పుష్కరిణి, రంగనాథ స్వామి ఆలయం, పుష్కరిణి సమీపంలో గల వేపమాను రాగి చెట్టు, సూర్యనారాయణ స్వామి గుడి, గంగూండ్ర మండపం, తిరుచానూరు గ్రామ దేవత అయిన గంగమ్మ గుడి, వాహన మండపం వరకు దీపాలను ఊరేగిస్తూ ఈ కూడలిలలో దీపాలను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయ సీనియర్ అర్చకులు బాబు స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని దీపాల ఊరేగింపు చేయడం అనవసరంగా వస్తుందని అలాగే ఈ దీపాలను ప్రతిష్ఠించడం ద్వారా గ్రామంలోని ప్రజలకు సుఖశాంతులు అమ్మవారి దయ వల్ల కలుగుతుందని భక్తుల విశ్వాసం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ .ఈ.ఓ రమేష్,ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్,ఆలయ అర్చకులు వేంపల్లి శ్రీనివాసులు,పరిచారికలు  తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *