సిరా న్యూస్,ఏలూరు;
మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులుపోటెత్తుతున్నారు. పంచారామ క్షేత్రాల్లో పరమ శివుణ్ణి దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండి భారీ క్యూ ఏర్పాడింది. భీమవరం లోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.