సిరా న్యూస్,విశాఖపట్నం;
అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్బంగా విశాఖలో మహిళా సంఘాలు పలు ప్రదర్శనలు చేపట్టాయి.సమాజంలో మహిళలు ఎదుర్కోంటున్న సమస్యలపై గళమెత్తుతూ జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ మహిళా సమాఖ్య ఆద్వర్యంలో మహిళలు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.ప్రభుత్వాల వైఖరి కారణంగా మహిళలు సామాజిక హక్కులు కోల్పోతున్నారని,బీజేపీ ప్రభుత్వ పాలనతో మహిళల హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు.మరోవైపు ఐద్వా సంఘాల నేతలు కూడా ర్యాలీ చేపట్టారు.ప్రభుత్వాలు మహిళల హక్కుల పరిరక్షణకు కృషి చెయాలని కోరారు.
==================XXX