సిరా న్యూస్, ఓదెల
అభివృద్ది ధ్యేయం
* పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అభివృద్ది ధ్యేయంగా ముందుకెళ్తున్నామని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అన్నారు. శనివారం ఓదెల మండలంలో పలు గ్రామాలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపల్లి ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శనివారం గోపరపల్లి గ్రామంలో నూతన యాదవ సంఘం కమ్యూనిటీ హల్ , అంతర్గత సీ.సీ రోడ్డు, పోచమ్మ ఆలయం వద్ద నూతన బోర్వెల్ మోటార్ , నూతన రెడ్డి కమ్యూనిటీ హల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. హరిపురం గ్రామంలో నూతన అంతర్గత సీ.సీ రోడ్డ , కొలనూర్ గ్రామంలో నూతన అంతర్గత సీ.సీ రోడ్డ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఎమ్మార్వో ఎంపీడీవో జీ తిరుపతి .గోపరపల్లె కార్యదర్శి, గోపు నారాయణరెడ్డి తాజా మాజీ సర్పంచ్లు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి . బైరి రవికుమార్ సామ శంకర్, అల్లం సతీష్. కుం చం మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.