సిరా న్యూస్,అల్వాల్;
అల్వాల్ హిల్స్ లో పల్లవి మోడల్ స్కూల్ కు సంబంధించిన పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కు దిగారు. తమ స్కూల్లో కాకుండా పక్క వీధి ఓ అపార్ట్మెంట్లో బుక్ స్టాల్ ఏర్పాటు చేసి నయా దండా మొదలుపెట్టారని తల్లిదండ్రులు చెబుతున్నారు ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే ఊరుకోండి అని నిర్వహకులు తెలుపుతున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు