సిరా న్యూస్,ప్రజాక్రాంతి;
పెద్దపల్లి, వరంగల్ ఒక జనరల్ పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ మాదిగలకే కేటాయించాలనే ప్రధాన డిమాండుతో ఈ నెల 15 న కాన్షి రామ్ జయంతిని పురస్క రించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ శక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భీమ్ జ్యోతి ర్యాలీ కి రావాలని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ గజ్జెల కాంతంను హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు బొంకూరి సురేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అందుకోసమే రాజ్యంలో మాదిగలకు న్యాయంగా రావాల్సిన రాజకీయ వాటా కోసమే మాదిగ శక్తి నీ ఏర్పాటు చేయడం జరిగిందనీ ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ స్ధానంలో మొదటినుండి మాదిగలకు అన్యాయం జరుగుతుందని దానిని దృష్టిలో ఉంచుకొని మాదిగలందరు రాజ్యాధికారానికి రావల్సిన సమయం ఆసన్నమైందని సురేందర్ తెలిపారు.