సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి పట్టణం శివాలయం పక్కన జలిల్ కు చెందిన ఇల్లును కొనుగోలు చేశామని తాము కొనుగోలు చేసిన ఇంటిని మాకు ఇప్పించాలని చందపల్లికి చెందిన బట్టు కమల అధికారులను వేడుకున్నారు. 2016 లోనే ఇంటిని కొనుగోలు చేసి భర్త బట్టు మల్లయ్య పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరించారు. బట్టు మల్లయ్య భార్య కమల పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మొటేషన్ కోసం మున్సిపల్ అధికారికి ఇచ్చినా కాలయాపన చేసినట్లు వాపోయారు. మున్సిపల్ ప్రజా ప్రతినిధి భర్త మాట్లాడుతానని చెప్పి ఇంతవరకు కూడా న్యాయం చేయలేదని అన్నారు. మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధి భర్త మేము కొనుగోలు చేసిన ఇంటిని తిరిగి అమ్మిన వ్యక్తిపై అక్రమంగా మొటేషన్ చేయించాడని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధి భర్త బెదిరింపులకు పాల్పడుతున్నాడని విలపించారు. నా భర్త పొలం వద్దకు వెళ్లి వస్తుండగా జరిగిన ఆక్సిడెంట్ పై అనుమానాలు ఉన్నాయని, అధికారులు స్పందించి విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో కుటుంబ సభ్యులు చందు, అంజి, ఎలువాక శ్రీనివాస్ పాల్గొన్నారు.