సిరా న్యూస్,హన్మకొండ;
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో హన్మకొండ పరకాల ప్రధాన రహదారిపై సాగునీటి కోసం రైతులు ఆందోళన చేపట్టి ధర్నా రాస్తారోకో చేపట్టి వంట వార్పు కార్యక్రమం రోడ్డుపై నిర్వహించారు.మండలంలోని అంబాల శ్రీరాములపల్లి సుదనపల్లి, మాదన్నపేట, గునిపర్తి, గ్రామాల ప్రజలకు సాగు నీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గుండ్ల సింగారం వద్ద ఉన్న గేటు తెరిచి డిపిఎం 24 ద్వారా నీటిని విడుదల చేయాలని, డిమాండ్ చేశారు. లేనియెడల రైతుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇరిగేషన్ డిఎం, మరియు కలెక్టర్ స్పందించి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.