వెడ్మా బొజ్జుతో నే ఖానాపూర్ అభివృద్ధి సాధ్యం…

సిరా న్యూస్, పెంబి:

వెడ్మా బొజ్జుతో నే ఖానాపూర్ అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటు వేసి వెడ్మా బొజ్జును భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ న్యాయవాది సల్లా ప్రశాంత్ రెడ్డి కోరారు. జవహర్ బాల మంచ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తులాల శంకర్, పెంబి గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు గుగ్గిళ్ల భూమేష్‌ లతో కలిసి పెంబి మండలంలోని పలు  గ్రామాల్లో ఇంటింట ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అందరికీ రుణమాఫీ, నిరుద్యోగ భృతి, వంటి పథకాలు గాలి మూటలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ ఓటును చేయి గుర్తుకు వేసి, వెడ్మా బొజ్జుని భారీ మెజరిటీతో గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో నాయకులు స్వప్నిల్ రెడ్డి , తొకల మహేందర్, కృష్ణమచారి, భూక్యా సుభాష్, తులాల శంకర్, గుగ్గిల భుమేశ్, గోదురి భూమేశ్, దేశాబోయిన వెంకటేష్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *