సిరా న్యూస్, ఓదెల
డబుల్ కు.. ట్రబుల్
* అయోమయంలో లబ్ధిదారులు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి, పంపిణీ కానీ ఇళ్లను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తలేదు.డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్దిదారులు ఆశగా చూస్తున్నారు. ప్రభుత్వం పంపణీ చేయకపోవడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ఓదెల మండలం కేంద్రంలో గల 148 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా లబ్ధిదారులకు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో డబుల్ బెడ్ రూములు అలంకార ప్రాయంగా మారాయి. పాలన మాలింది.. పాలకులు మారారు.. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసినట్టు ఇళ్ల పరిస్థితి ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు అందజేసి న్యాయం చేయగలరని లబ్ధిదారులు కోరుతున్నారు