Surendra Babu:గెలిపించండి.. స‌మ‌స్య‌ల‌ను తీరుస్తా

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
గెలిపించండి.. స‌మ‌స్య‌ల‌ను తీరుస్తా
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు
పారిశుద్ధ్య కార్మికుల స‌మ‌స్యను ప‌రిష్క‌రిస్తా
గెలిపించండి.. స‌మ‌స్య‌ల‌ను తీరుస్తాన‌ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మంగ‌ళ‌వారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఉద‌యం మార్నింగ్ వాక్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో వీధుల్లో తిరుగుతూ…ప్రజలతో మమేకమై తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. తాను ఎమ్మెల్యే గా గెలిస్తే ఏ ఒక్క వర్గాన్ని ఇబ్బంది పెట్టనని, అభివృద్దే మంత్రంగా ముందుకు సాగుతానని భరోసా ఇచ్చారు. మార్నింగ్ వాక్ వచ్చిన సురేందర్ బాబు ప్రధాన రహదారుల ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు.టిడిపి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, ఏ సమస్య వచ్చినా నేను అండంగఉంటాను, మీ సమస్య తీరుస్తానని చెప్పారు. నాకు ఎమ్మెల్యేగా ఓటు వేయించి గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *