సిరా న్యూస్, కళ్యాణదుర్గం
ప్రజల చెంతకు అమిలినేని కుమారుడు
* ప్రజాదరణతో ముందుకెళ్తా
* వార్డులలో అమిలినేని యశ్వంత్ చౌదరి పర్యటన
ప్రజాదరణతో ముందుకెళ్తానని టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు కుమారుడు అమిలినేని యశ్వంత్ అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలో స్దానిక మారెంపల్లి కాలనీలో టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు కుమారుడు అమిలినేని యశ్వంత్ మార్నింగ్ వాక్ పేరుతో కాలనీలో పర్యటించారు.కాలనీలో నెలకొన్న సమస్యలపై పలువురు ఆయనకు తెలియజేశారు. కాలనీలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. వీది లైట్లు కూడా రాత్రి పూట నడవాడానికి ఇబ్బందులు అని మహిళలు తెలుపడంతో మాకు మద్దతు ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూస్తాం అని తెలిపారు.కాలనీలో ఉన్న ఓ హోటల్ లో సామన్యుడిలాగా టిఫెన్ చేసి వెళ్లారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టిడిపి నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.