సిరా న్యూస్,రాజమండ్రి;
స్పా ల ముసుగులో చట్టా వ్యతిరేకమైన వ్యవహారాలు జరుగుతున్నాయని తెలిసి ప్రత్యేక దాడులు చేశామని ప్రకాష్ నగర్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు. అక్కడ వ్యభిచారం జరుగుతుందని గుర్తించాం. నలుగురు మహిళలను నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నాం. నలుగురు విటుల్లో కొవ్వూరు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు గుర్తించాం. ఆ ప్రభుత్వ ఉద్యోగి పై విచారణ చేస్తున్నాం. అనుమతులు లేకుండా స్పాలు నడుపుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడితే చర్యలు తప్పవు. ఇల్లు అద్దెకిచ్చే వారిపై కూడా నిఘా పెడుతున్నాం. ఆర్థిక సమస్యల కారణంగా వ్యభిచారం చేసినట్లుగా తెలిసింది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలనిఅయన సూచించారు.