పాములపాడులో బిఎస్ఎఫ్ జవాన్లతో కలిసి కవాతు

సిరా న్యూస్,పాములపాడు;
ప్రజలు ఎటువంటి గొడవలకు పాల్పడకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించిన సిఐలు, ఎస్ఐలు.
పాములపాడు:-మండల కేంద్రమైన పాములపాడు లో బిఎస్ఎఫ్ జవాన్లతో కలిసి ఆత్మకూరు రూలర్ సిఐ నాగభూషణం, ఆత్మకూరు టౌన్ సిఐ లక్ష్మీనారాయణ, పాములపాడు ఎస్సై జి.అశోక్, కొత్తపల్లి ఎస్సై హరిప్రసాద్, వెలుగోడు ఎస్సై భూపాలుడు ల ఆధ్వర్యంలో ఇద్దరు బిఎస్ఎఫ్ ఎస్ఐలు, 30 మంది బిఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు, పదిమంది సర్కిల్ సివిల్ పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ నుండి ఎస్సీ కాలనీ చివరి వరకు కవాతు నిర్వహించి, బస్టాండ్ సర్కిల్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పాములపాడు ఎస్సై జి.అశోక్, సిఐలు నాగభూషణం, లక్ష్మీనారాయణ లు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎలక్షన్ లలో పట్టణాలలో కానీ, గ్రామాలలో కానీ ఎవరైనా, ఎటువంటి గొడవలకు పాల్పడకుండా, వివాదాలకు తావు ఇవ్వకుండా, స్వేచ్ఛాయిత వాతావరణంలో ప్రజలందరూ ఎక్కువ శాతం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో కూడా కుల. మతాలను, వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టరాదని, మద్యం పబ్లిక్ ప్లేస్ లలో త్రాగరాదని, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నలుగురి కంటే ఎక్కువ మంది ప్రజలు గుంపులుగా ఉండరాదని, ఎవరైనా కూడా చట్టా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో ఎలాంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడడమే ఈ కవాతు ముఖ్య ఉద్దేశం అన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడానికి, రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా, ప్రశాంత వాతావరణ కల్పించడమే మా పోలీసుల ముఖ్య ధ్యేయమని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *